
పంజాగుట్ట, వెలుగు: కుష్ఠు వ్యాధి నివారణకు పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆసియా బేగం ప్రత్యేక కృషి చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అవగాహన కల్పించడంతో పాటు నివారణకు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. అమె సేవలను గుర్తించిన వైద్యారోగ్య శాఖ ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసింది. యాంటీ లెప్రసీ డే సందర్భంగా బుధవారం సిటీలో నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్ జిల్లా అదనపు డీఎంహెచ్‌వో నిర్మల ప్రభావతి చేతుల మీదుగా ఉత్తమ అవార్డును ఆసియా అందుకున్నారు. నిమ్స్ వైద్యురాలికి అవార్డు రావడంతో నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప ప్రత్యేకంగా అభినందించారు.