అరుదైన గుండె శస్త్ర చికిత్స చేసిన నిమ్స్ వైద్యులు

అరుదైన గుండె శస్త్ర చికిత్స చేసిన నిమ్స్ వైద్యులు

నిమ్స్ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్లు తొలిసారి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మోడ్రన్ టెక్నాలజీ ఉపయోగించి ఎలాంటి కోత లేకుండా లేకుండా గుండె ఆపరేషన్ నిర్వహించారు.  భూపాలపల్లి జిల్లాకు చెందిన 19 ఏండ్ల జాహ్నవికి పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధి ఉంది. మూడేళ్ల వయసులో తల్లిదండ్రులకు విషయం తెలియడంతో బిడ్డను కాపాడుకునేందుకు హాస్పిటళ్లన్నీ తిరిగారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు యువతి బతకాలంటే రూ.30 నుంచి 40 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో పేరెంట్స్ నిమ్స్ వైద్యులను ఆశ్రయించారు. 

నిమ్స్ కార్డియాలజీ డిపార్ట్ మెంట్ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఓరుగంటి సాయి సతీష్ తన టీంతో  కలిసి జాహ్నవికి ఆపరేషన్ చేసేందుకు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి టెట్రాలజీ ఆఫ్ పాలో ఆపరేషన్ నిర్వహించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో పేషెంట్ ఒక్కరోజులోనే సాధారణ స్థితికి చేరుకుంది. తమ బిడ్డకు పునర్జన్మనిచ్చిన నిమ్స్ వైద్యులకు జాహ్నవి తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.