నిమ్స్ ఆస్పత్రిలో టెస్టుల కోసం పడిగాపులు.. టోకెన్లు జారీ చేసిన 13రోజులకు..

నిమ్స్ ఆస్పత్రిలో టెస్టుల కోసం పడిగాపులు.. టోకెన్లు జారీ చేసిన 13రోజులకు..

నిమ్స్ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా మారింది. ఆరోగ్య సమస్యలతో  వందల కిలో మీటర్ల నుంచి ఆసుపత్రికి వస్తే రోగులకు టోకెన్ల పేరుతో వైద్య సిబ్బంది నరకం చూపిస్తున్నారు. ఒక్కో టెస్ట్ చేయించుకోవాలంటే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. 

నిమ్స్ ఆస్పత్రిలో టెస్ట్ ల కొరత చాలా దారుణంగా తయారైంది. టెస్టుల కోసం సిబ్బంది టోకెన్లు జారీ చేసిన.. 13 రోజుల తర్వాత టెస్టులు నిర్వహిస్తున్నారు. ఏ టెస్ట్ అయినా  వారం నుంచి పది రోజుల సమయం పడుతుందని రోగులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి టెస్టుల కోసం వచ్చిన వారికి అవస్థలు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని రోగులు వేడుకుంటున్నారు.