పెయిన్‌కిల్లర్స్‌కు బదులుగా పారాసెటమాల్ వాడండి.. డెంగ్యూ వ్యాధిగ్రస్థులకు సూచన

పెయిన్‌కిల్లర్స్‌కు బదులుగా పారాసెటమాల్ వాడండి.. డెంగ్యూ వ్యాధిగ్రస్థులకు సూచన

వర్షాకాలం డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉన్నందున, ఘజియాబాద్‌లో కొన్ని వారాల్లోనే 100 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో వ్యాధి బారిన పడకుండా ప్రజలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం, లక్షణాల తీవ్రతను తగ్గించడానికి నొప్పి నివారణ మందులకు బదులుగా పారాసెటమాల్ తీసుకోవడం ఉత్తమం. ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ వంటి పెయిన్‌ కిల్లర్లు డెంగ్యూ జ్వరం ఉన్న రోగులలో మరిన్ని సమస్యలను పెంచుతాయి. మరోవైపు, పారాసెటమాల్ డెంగ్యూ రోగులకు సురక్షితంగా పరిగణించబడుతుంది. జ్వరం, ఇతర వ్యాధి సంబంధిత లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

డెంగ్యూ రోగులకు పారాసెటమాలే ఎందుకు సురక్షితమన్న విషయానికొస్తే.. పెయిన్ కిల్లర్స్ డెంగ్యూ పేషెంట్లలో రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే డెంగ్యూ జ్వరం వచ్చిన వారిలో ప్లేట్‌లెట్స్ కౌంట్ గణనీయంగా పడిపోతుంది. పెయిన్ కిల్లర్లు వాటిని మరింత తగ్గిస్తాయి. ఇది రక్తస్రావం సమస్యలకు దారితీస్తుంది. మరోవైపు, పారాసెటమాల్ ప్లేట్‌లెట్ కౌంట్‌ను ప్రభావితం చేయదు, డెంగ్యూ రోగులకు ఇది సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇతర లక్షణాలతో పాటు ఛాతీపై ఎర్రటి మచ్చలు ఉన్నట్లయితే ప్రజలు వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఘజియాబాద్ ఆరోగ్య అధికారులు తెలిపారు.  

డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ సీజన్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరుబయట ఉన్నప్పుడు దోమల నివారణను ఫుల్‌స్లీవ్‌ల దుస్తులను ధరించాలి. కావున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిలిచిపోకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. రెగ్యులర్ ఫ్యూమిగేషన్ కూడా దోమలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది దోమల వల్ల కలిగే వ్యాధుల బారిన పడకుండానూ కాపాడుతుంది.