తక్కువ ఖర్చుతో నిమ్స్‌లో హెల్త్ చెకప్ ప్యాకేజీలు: కట్టాల్సిన ఫీజులివే

తక్కువ ఖర్చుతో నిమ్స్‌లో హెల్త్ చెకప్ ప్యాకేజీలు: కట్టాల్సిన ఫీజులివే

నిమ్స్‌లో హెల్త్ చెకప్ ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు నిమ్స్ లో ఈ సౌకర్యం లేదు. మొత్తం డజను ప్రొఫైల్ ప్యాకేజీలతో డయగ్నోస్టిక్ సర్వీసెస్‌ను అందిస్తోంది నిమ్స్. 12 రకాల ప్యాకేజీలతో ఓ బ్రోచర్ ను రిలీజ్ చేశారు. మెరుగైన వైద్యం అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో.. హెల్త్ ప్యాకేజీలు లాంచ్ చేస్తున్నట్లు నిమ్స్ తెలిపింది. నిమ్స్ మాస్టర్ హెల్త్ చెకప్, డయాబెటిక్ హెల్త్ చెకప్, ఉమెన్ వెల్‌నెస్ చెకప్, ఫీవర్ ప్రొఫైల్, అనీమియా టెస్ట్స్, రెస్పిరేటరీ హెల్త్, బోన్స్ హెల్త్ చెకప్, కార్డియాక్ హెల్త్ చెకప్, కిడ్నీ హెల్త్ చెకప్, క్యాన్సర్ స్క్రీనింగ్, టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ పేరుతో 12 రకాల సేవలను అందించేందుకు రెడీ అయింది నిమ్స్. హెల్త్ చెకప్ చేయించుకునేవారికి డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది. ఎవరైనా నేరుగా నిమ్స్‌కు వచ్చి చెకప్ చేయంచుకోవచ్చు. హెల్త్ చెకప్‌ల కోసం ఓపీ డిపార్ట్‌మెంట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. బయటి హాస్పిటళ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లతో పోలిస్తే ఇక్కడ హెల్త్ ప్యాకేజీలు 40 శాతం తక్కువ కాస్ట్‌తో పెట్టినట్లు చెప్పారు నిమ్స్ అధికారులు. సామాన్యులకు అందుబాటులో తక్కువ ఖర్చుతో టెస్టులు చేయించుకునేలా ఈ సదుపాయాన్ని ప్రారంభించామన్నారు.

హెల్త్ ప్యాకేజీ                                            ధర

నిమ్స్ మాస్టర్ హెల్త్ చెకప్                       రూ.2800

డయాబెటిక్ హెల్త్ చెకప్                           రూ.2100

ఉమన్ వెల్‌నెస్ చెకప్                              రూ.4700

పీవర్ ప్రొఫైల్                                           రూ.4500

అనీమియా టెస్ట్స్                                      రూ.2000

రెస్పిరేటరీ హెల్త్ చెకప్                                  రూ.1500

బోన్స్ అండ్ జాయింట్స్ హెల్త్                        రూ.2400

కార్డియాక్ హెల్త్ చెకప్                                  రూ.3800

కిడ్నీ హెల్త్ చెకప్                                         రూ.1900

కేన్సర్ స్క్రీనింగ్ (మగవారికి)                          రూ.2000

కేన్సర్ స్క్రీనింగ్ (ఆడవారికి)                           రూ.500

టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్                              రూ.2500

లివర్ ప్రొఫైల్                                             రూ.2200

ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ (మగవారికి)              రూ.7000

ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ (ఆడవారికి)               రూ.8000