సమ్మె విరమించిన నిమ్స్ నర్సులు

సమ్మె విరమించిన నిమ్స్ నర్సులు
  • రూ. 32 వేల జీతం, పే స్లిప్స్ ఇచ్చేందుకు మేనేజ్ మెంట్ ఓకే

ఖైరతాబాద్, వెలుగు: పది రోజులగా సమ్మె చేస్తున్న నిమ్స్​నర్సులకు రూ. 32వేల జీతం, పే స్లిప్స్​ ఇవ్వడానికి హాస్పిటల్ మేనేజ్ మెంట్ అంగీకరించింది. దీంతో బుధవారం నర్సులు సమ్మె విరమించారు. ఏండ్లుగా నిమ్స్ లో పనిచేస్తున్నా పర్మినెంట్ చేయడం లేదంటూ నర్సులు 10 రోజుల పాటు సమ్మె చేశారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కు ఇచ్చే బెనిఫిట్స్ కాంట్రాక్ట్​ నర్సులకు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఇతర డిమాండ్లను నెరవేర్చుకొని సమ్మె విరమించారు.  పే స్లిప్స్ తో పాటు, జీతాన్ని రూ.25 వేల నుంచి రూ.32 వేలకు పెంచేందుకు మేనేజ్ మెంట్ ఒప్పుకుంది. టెన్యూర్ ను 6 నెలల నుంచి ఏడాదికి చేయడంతో పాటు 2021 జులై  నుంచి  30 శాతం ఏరియర్స్ ఇస్తామని నిమ్స్​మేనేజ్​మెంట్ ప్రకటించడంతో నర్సులు సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు.