ఫుడ్ లో పోషకాలు తెలుసుకునే న్యూట్రీ ఎయిడ్​ .. ప్రత్యేక యాప్​ను ఆవిష్కరించిన ఎన్ఐఎన్   

ఫుడ్ లో పోషకాలు తెలుసుకునే న్యూట్రీ ఎయిడ్​ .. ప్రత్యేక యాప్​ను ఆవిష్కరించిన ఎన్ఐఎన్   

సికింద్రాబాద్​,వెలుగు:  కరోనా తర్వాత తినే ఫుడ్ పై ప్రజల్లో మరింత  శ్రద్ధ పెరిగింది. అయితే  తినే పుడ్ లో ఏయే పదార్థాలు ఎంతెంత మోతాదులో పోషక విలువలు ఉన్నాయని తెలుసుకునేందుకు తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్​ఐఎన్​) జర్మనీ సైంటిస్టులతో కలిసి  న్యూట్రీ ఎయిడ్ పేరుతో ఒక ప్రత్యేక యాప్​ను రూపొందించింది. దీన్ని గురువారం ఎన్​ఐఎన్​లో ఆవిష్కరించింది.

ఇది ఒక  వినూత్నమైన, సమగ్ర మొబైల్ యాప్ కోసం రూపొందించిన అప్లికేషన్. మనం తినబోయే ఫుడ్ ను  స్కాన్​ చేయడం ద్వారా అందులోని పోషక విలువలు ఏ మేరకు ఉన్నాయనేది క్షణాల్లో తెలుసుకోవచ్చు. మనం ప్రతి రోజు తినే ఇడ్లీ, వడ, ఇతర అల్పహార పదార్థాలను ఒకసారి మన ఫోన్​ఆన్​చేసి యాప్​తో స్కాన్​చేస్తే క్షణాల్లో అందులోని పిండి పదార్థాలు, విటమిన్లు, ప్రోటీనులు, ఇతర పోషక పదార్థాలు ఎంతెంత మేరకు ఉన్నాయనే విషయాలను  వాటి పర్సెంటేజీలను తెలియజేస్తుందని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

 తార్నాక లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్​ఐఎన్​) జర్మనీలోని ఆక్స్ బర్గ్​యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్​మార్కస్​ , చండీఘర్​కు చెందిన పలువురు  ఫుడ్​న్యూట్రీషన్​ సైంటిస్టుల బృందం  రెండేళ్ల పాటు శ్రమించి యాప్​ను రూపొందించారు.  ఇందుకు సుమారు 720 మంది ఆహారపు అలవాట్లు , ఇతర అంశాలను పరిశీలించారు.