
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సీపీఐ నేత చందు నాయక్ హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొత్తం తొమ్మిది మంది పేర్లను FIR లో చేర్చారు. ప్రధాన నిందితుడు రాజేశ్ తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రా చారి, యాదిరెడ్డి లు నిందితులుగా చేర్చారు పోలీసులు. కాల్పులు జరిపింది నలుగురు అయితే..వారికి సహకరించింది మరో ఐదుగురిగా పోలీసులు గుర్తించారు.
మున్నా, రాయుడు, యాదిరెడ్డి, బాషాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు వాడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులు కోసం ప్రత్యేకంగా పది టీమ్‌లతో గాలిస్తున్నారు పోలీసులు.
కాల్పులు జరిపిన నలుగురు రాజేష్, సుధాకర్, శివ,బాషా గా గుర్తించిన పోలీసులు..భూ తగాదాల వల్లే చందు నాయక్ ను కాల్చినట్లు తేల్చారు పోలీసులు. కాల్పులకు కుంట్లూర్ లోని భూ తగాదాలే కారణమని చెప్పారు.నిందితులు చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో గుర్తించారు . నిందితులను పట్టుకోవడానికి పది టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు.
Also Read : హైదరాబాద్లో షీ టీమ్స్కి చిక్కిన చిల్లరగాళ్ళు
గత కొద్ది రోజుల నుంచి రాజేశ్ కి చందు నాయక్ కి మధ్య విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్ లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేశ్ కక్ష పెంచుకుని ఈ హత్య చేసినట్లు చెబుతున్నారు. సీపీఐ పార్టీలో ప్రస్తుతం కౌన్సిల్ నెంబర్ గా ఉన్న చందు నాయక్ తో కలిసి తిరిగిన రాజేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, సీపీఐ నాయకులు పోలీసులను కోరారు.
జులై 15న ఉదయం మలక్ పేటలోని పార్క్ ముందు చందు నాయక్ ను దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. పక్కా ప్లాన్ ప్రకారమే ఏడు రౌండ్లు కాల్పులు జరిపి హతమార్చారు.