త్వరలో తొమ్మిది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు : రైల్వే మంత్రిత్వ శాఖ

త్వరలో తొమ్మిది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు : రైల్వే మంత్రిత్వ శాఖ
  •     రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన 

న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలో తొమ్మిది అమృత్ భారత్ ఎక్స్‌‌ ప్రెస్ రైళ్లను ప్రారంభించనుంది. ఈ నాన్ ఏసీ ట్రైన్స్ బెంగాల్, అస్సాం నుంచి బయలుదేరనున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక వంటి ఏడు రాష్ట్రాలను కలుపనున్నాయి. ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను అస్సాం, బిహార్, బెంగాల్ గుండా వెళ్లే రైలు మార్గాల్లో ప్రవేశపెట్టనున్నారు.

ఈ మేరకు మంగళవారం రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.‘‘పండుగ సీజన్లు, రద్దీ సమయాలు, అధిక సంఖ్యలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను రూపొందించాం. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉపాధి, విద్య, కుటుంబ అవసరాల కోసం ప్రయాణించేవారికీ ఈ ట్రైన్స్ సరసమైన, మెరుగైన కనెక్టివిటీని అందిస్తాయి’’ అని పేర్కొంది.