
మహారాష్ట్ర: కరోనాతో చనిపోయిన వ్యక్తి భౌతికకాయానికి కర్మకాండలు నిర్వహించిన ఓ ఫ్యామిలీ మొత్తం వైరస్ బారిన పడింది. ఈ విషాద సంఘటన శుక్రవారం మహారాష్ట్రలో జరిగింది. మే-8న థానే జిల్లా, ఉల్లాస్ నగర్ టౌన్ షిప్ కు చెందిన ఓ వ్యక్తి(50) కరోనా సోకి మరణించాడు. అధికారులు మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే వారు డెడ్ బాడీపై ఉన్న కవర్లు తీసి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
దీంతో మృతుడి ఫ్యామిలీలో 9 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వెంటనే వారిని హాస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నామన్న అధికారులు.. కరోనా డెడ్ బాడీపై ఉన్న ప్లాస్టిక్ కవర్లను ఎట్టి పరిస్థితితోనూ తొలగించరాదని చెప్పారు.. అంత్యక్రియల్లోనూ సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.