ఆసియా అండర్‌‌–20 అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్‌.. నిపామ్‌‌కు బ్రాంజ్‌‌

ఆసియా అండర్‌‌–20 అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్‌.. నిపామ్‌‌కు బ్రాంజ్‌‌

హాంకాంగ్: ఇండియా యంగ్‌‌ స్ప్రింటర్‌‌ నిపామ్‌‌.. ఆసియా అండర్‌‌–20 అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బ్రాంజ్‌‌ మెడల్‌‌తో మెరిసింది. గురువారం జరిగిన విమెన్స్‌‌ 100 మీటర్ల పరుగును నిపామ్‌‌ 11.62 సెకన్లలో ముగించి మూడో ప్లేస్‌‌లో నిలిచింది.

దానా నూర్‌‌ సలేమ్‌‌ (ఖతార్‌‌, 11.47 సె), క్విన్‌‌ జువాన్‌‌ చెన్‌‌ (చైనా, 11.54 సె) వరుసగా గోల్డ్‌‌, సిల్వర్‌‌ సాధించారు. విమెన్స్‌‌ 400 మీటర్లలో నీరూ పాఠక్‌‌, తహురా ఖాతూన్‌‌ ఫైనల్లోకి ప్రవేశించారు. హీట్స్‌‌లో నీరూ 54.42 సెకన్లలో, తహురా 55.06 సెకన్లలో లక్ష్యాన్ని చేరారు.