చరిత్ర తెలియని అజ్ఞానులు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నరు: నిరంజన్ రెడ్డి

చరిత్ర తెలియని అజ్ఞానులు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నరు: నిరంజన్ రెడ్డి

ఉచిత కరెంట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది.  కరెంట్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్ వేశారు. ఆన్ లైన్ టెండర్  కొనుగోళ్లలో  మామూళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కొందరు చరిత్ర తెలియని అజ్ఞానులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

గతంలో కాంగ్రెస్ 9 గంటల ఉచిత విద్యుతే ఇచ్చిందన్నారు నిరంజన్ రెడ్డి. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని గతంలో  కాంగ్రెస్ నేతలే చెప్పారన్నారు.  అవగాహన లేని నేతలే సబ్ స్టేషన్ల దగ్గరకు వెళ్లి  ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము 24 గంటల ఉచిత  కరెంట్ ను ఇచ్చి చూపిస్తున్నామని తెలిపారు.  24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేయడం సంస్కారమా? అని నిలదీశారు.  
 
ఇవాళ తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా నిలిచిందన్నారు నిరంజన్ రెడ్డి. అన్ని రంగాలకు నేడు విద్యుత్ అందుబాటులో ఉందన్నారు.  దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.  కాంగ్రెస్, బీజేపీలు ప్రజల కోసం ఏనాడు పనిచేయలేదని.. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.  కాంగ్రెస్ హయాంలో పేరుకే 9 గంటల విద్యుత్ ఇచ్చేదని..పరిశ్రమలు మూతపడ్డాయన్నారు.