నీరవ్ మోడీ ఆస్తులను సీజ్ చేసిన ED

నీరవ్ మోడీ ఆస్తులను సీజ్ చేసిన ED

పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)ను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) స్వాధీనం చేసుకుంది. ముంబై సూరత్ లలోని నీరవ్ కి చెందిన 177.2 కోట్ల విలువైన ఆస్తులను మంగళవారం ED స్వాధీనం చేసుకుంది.స్వాధీనం చేసుకున్న వాటిలో 8 ఖరీదైన కార్లు, మెషినరీ, నగలు, పెయింటింగ్స్‌తో పాటు కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నాయి.  మనీ లాండరింగ్ చట్టం కింద ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.