డైనమెట్లతో నీరవ్ మోడీ ఇల్లు కూల్చివేశారు

డైనమెట్లతో నీరవ్ మోడీ ఇల్లు కూల్చివేశారు

పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) ఫ్రాడ్ కేసును ఎదుర్కోంటున్న నీరవ్ మోడీకి ఇంటి రూపంలో మరో కష్టం వచ్చిపడింది రాయిగఢ్ లో సముద్రపు ఒడ్డున కట్టిన అంత్యంత విలాసవంతమైన 100 కోట్ల విలువ చేసే ఇంటిని డైనమెట్లతో ఇవాళ(శుక్రవారం) పేల్చివేశారు అక్కడి అధికారులు.

ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిహిమ్ బీచ్ ఒడ్డున విలావంతమైన రూపాన్య అనే పేరుతో ఇల్లు కట్టారు. 33,000 చదరపు అడుగుల్లో నిర్మించారు. పటిష్టమైన సెక్యూరిటి గేట్ ,స్విమ్మింగ్ పూల్ తో గ్రౌండ్ ప్లస్ వన్ ప్లోర్ ను నిర్మించారు. దీని విలువ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

అయితే ఆయన కట్టిన ఇళ్లు కోస్టల్ రెగ్యూలేటరీ జోన్ నిబంధనలకు ఉండడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన పర్మిషన్ లేదనే కారణంతో పాటు 2009లో పర్యవరణానికి హనీ కలిగించే కట్టడాలపై ముంబై హైకోర్టులో పిల్ వేశారు. దీంతో నీరవ్ మోడీ ఇల్లును అధికారులు కూల్చి పనులు గత కొంత కాలంగా మొదలు పెట్టారు. అయితే ఇళ్లు చాల పటిష్టంగా ఉండడంతో దాన్ని కూల్చి వేయడం కష్టమవుతుండటంతో అధికారులు డైనమెట్లతో పేల్చి వేసేందుకు నిర్ణయించారు.