హక్కులు దోషులకేనా.. మాకు లేవా?

హక్కులు దోషులకేనా.. మాకు లేవా?

కోర్టులో జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్న నిర్భయ తల్లి

న్యూఢిల్లీ: ‘మేం ఎక్కడికి వెళ్లినా దోషుల హక్కుల గురించి చెబుతున్నారు. నిర్భయకు, మాకు ఎలాంటి హక్కులు లేవా? దోషులకు విధించిన శిక్ష అమలు కోసం ఇంకెంత కాలం ఎదురుచూడాలి’ అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి పాటియాలా కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో చలించిపోయిన జడ్జి ఆమెను ఓదార్చారు. అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని ఊరడించారు.. డెత్​ వారెంట్​ ఇష్యూపై జరిగిన విచారణ సందర్భంగా బుధవారం పాటియాలా కోర్టులో ఈ ఘటన జరిగింది.

అంతకుముందు దోషి అక్షయ్​సింగ్​ పెట్టుకున్న రివ్యూ పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టేయడంతో పాటియాలా కోర్టులోనూ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాదేవి భావించారు. అయితే, పిటిషన్​ కొట్టేసిన వెంటనే డెత్​ వారెంట్​ ఇష్యూ చేయలేమని, డెత్​వారెంట్​ ఇష్యూను జడ్జి వాయిదా వేయడంతో ఆశాదేవి కోర్టు హాల్లోనే భోరుమన్నారు. దీంతో ‘మీపట్ల, మీ కూతురుకు జరిగిన అన్యాయంపట్ల మాకు సానుభూతి ఉంది. మీరు చెప్పింది వినడానికే మేమిక్కడ ఉన్నాం. అయితే, దోషులకు కూడా హక్కులు ఉంటాయి. వాటిని ఉపయోగించుకునే అవకాశం వారికివ్వాలి. చట్టానికి కట్టుబడి, అన్ని అవకాశాల తర్వాతే డెత్​ వారెంట్​జారీ చేయాలి’ అని జడ్జి చెప్పారు.

More News

కాషాయ నేతలు పెండ్లి చేసుకోరు.. రేప్‌లు చేస్తరు

గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

లంచం కేసులను లైట్ తీసుకుంటున్న సర్కార్

హాస్యనటుడు అలీకి మాతృ వియోగం