
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ అసెంబ్లీలో సూచించారు. చిహ్నంలో కాకతీయుల ఫొటో తీయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాచరికపు చిహ్నాలను తొలగించాలని, TS నుంచి TGగా మార్చడంలో అభ్యంతరం లేదని ఏలేటి చెప్పారు. టెక్నికల్ ఛేంజ్ కాదు క్వాలిటేటివ్ ఛేంజ్ కావాలని ఆయన సూచించారు. ఏలేటి వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు. ప్రజల అభిప్రాయం మేరకే మార్పులు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలపై, బస్సులపై ఇప్పటికే TSను TGగా మార్చిన సంగతి తెలిసిందే. వాహనాల రిజిస్ట్రేషన్ కూడా TG పేరుతో చేస్తున్న సంగతి తెలిసిందే.