ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే పీవోలు, ఏపీవోలు తమ బాధ్యతలు సమర్థంగా నిర్వర్థించాలని నిర్మల్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే పీవోలు, ఏపీవోలకు మామడ మండల కేంద్రంలోని రైతువేదికలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 

కార్యక్రమానికి ఎన్నికల అధికారి హాజరై మాట్లాడారు. మండలాల వారీగా పీవోలు, ఏపీవోలకు ఎన్నికల విధులపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. బాధ్యతాయుతంగా తమ విధులు పూర్తిచేయాలన్నారు. 

ఎన్నికల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల విధులు పారదర్శకంగా, జవాబుదారీతనంతో, ఖచ్చితత్వంతో నిర్వర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకల్యాణి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.