నిర్మల్, వెలుగు: ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే లోక్‌అదాలత్‌లను నిర్వహిస్తున్నామని నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. డిసెంబర్ 21న జిల్లాలో జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం కోసం నిర్వహించిన సమావేశంలో జడ్జి మాట్లాడారు. లోక్ అదాలత్‌ల కోసం కేసుల జాబితాలను సిద్ధం చేయాలని, సంబంధిత పక్షాలతో ముందస్తు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, రాజీకి ప్రయత్నించాలని సూచించారు.
పోలీస్, న్యాయ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి లోక్ టఅదాలత్ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహనలు కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్పీ జానకీ షర్మిల, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ రాధిక, పోలీస్, జ్యుడీషియల్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు.
