వరికొయ్యలకు నిప్పు.. 200 ఎకరాల్లో వరి దగ్ధం .. నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా సోన్‌‌‌‌‌‌‌‌ లో ప్రమాదం

వరికొయ్యలకు నిప్పు.. 200 ఎకరాల్లో వరి దగ్ధం .. నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా సోన్‌‌‌‌‌‌‌‌ లో ప్రమాదం

నిర్మల్, వెలుగు : వరికొయ్యలకు పెట్టిన నిప్పంటుకొని 200 ఎకరాల్లో వరి దగ్ధమైంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి పంట చేనులోని వరికొయ్యలకు నిప్పు పెట్టారు. 

ఇదే సమయంలో తీవ్ర గాలి దుమారం రావడంతో మంటలు పక్క పొలాలకు వ్యాపించాయి. దీంతో సుమారు 200 ఎకరాల్లో వరితో పాటు 100కు పైగా మోటార్లు కాలిబూడిదయ్యాయి. గమనించిన రైతులు ఫైర్‌‌‌‌‌‌‌‌ ఇంజిన్‌‌‌‌‌‌‌‌కు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.