బచ్చన్నపేట, వెలుగు: తుఫాన్వల్ల నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.30వేల చొప్పున ఇవ్వాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి రాష్ట్ర సర్కార్ను డిమాండ్ చేశారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట, నర్మెట్ట మండలం వెల్దెండ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.
కాగా, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నారాణపూర్కి చెందిన సీనియర్ నాయకులు పరిదే భీమేశ్ బీజేపీలో చేరాడు. ఆయన వెంట కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, జగన్మోహన్రెడ్డి, బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
