నిర్మల్ జిల్లా చరిత్ర చాటి చెప్పే.. నిర్మల్ ఉత్సవాలు ప్రారంభం

నిర్మల్ జిల్లా చరిత్ర చాటి చెప్పే.. నిర్మల్ ఉత్సవాలు ప్రారంభం
  • ఉత్సవాలను  ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు 
  •  నిర్మల్‌ చరిత్రను తెలిసేలా  విద్యార్థులు నృత్యాలు 

నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే వేదికగా నిర్మల్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఇంఛార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాలను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు తెలిపే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని మంత్రి అన్నారు. 

ALSO READ : జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్స్

సోమవారం రాత్రి నిర్వహించిన నిర్మల్ ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రికి గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.  అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు.

ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు నిర్మల్‌ చరిత్రను తెలిసేలా నృత్యాలు ప్రదర్శించారు. పలు పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఇందిర మహిళా శక్తి ఆధ్వర్యంలో అనేక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ లో ఇప్పపువ్వు లడ్డూ, మక్క వడలు పట్టణ ప్రజలు రుచి చూశారు.