దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2020-2021 సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది రెండవసారి. 2020బడ్జెట్‌పై దేశం మొత్తం భారీ అంచానాలను పెట్టుకుంది. ప్రజల ఆదాయం పెంచె దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఇది సామాన్యుల బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు. ఈ సంవత్సరం కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లిస్తున్నారని ఆమె తెలిపారు. దాదాపు 40 కోట్ల మంది పన్ను రిటర్న్ ఫైల్ చేశారని ఆమె తెలిపారు. రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయని ఆమె అన్నారు.
