ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3 ల‌క్ష‌ల కోట్ల రుణాలు

ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3 ల‌క్ష‌ల కోట్ల రుణాలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను బుధ‌వారం మీడియాకు వెల్లడించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ మెగా‌ ప్యాకేజీలో భాగంగా… చిన్న మధ్యతరహా సంస్థలకు రూ.3 లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ ఎంఎస్ఎంఈ రుణాలకు కేంద్రం గ్యారెంటీగా ఉంటుందన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా 12 నెలల మారటోరియంతో రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రుణ సదుపాయం అక్టోబర్ వరకు ఉంటుందన్నారు. నాలుగేళ్లలో తిరిగి చెల్లించేలా 12 నెలల మారటోరియం ఉంటుందన్నారు.

దీని వ‌ల్ల 45 లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు లబ్ధి చూకురుతుందని మంత్రి తెలిపారు. అలాగే, తీవ్ర ఒత్తిళ్లలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.20,000 కోట్ల సబార్డినేట్ రుణాలు ఇస్తామ‌ని. ఆ తరహా 2 లక్షల వ్యాపారాలకు ఇందువల్ల లబ్ధి చేకూరుతుందని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధికి రూపకల్పన చేశామని ఆమె చెప్పారు కార్యకలాపాలు విస్తరించి మెరుగైన అవకాశాలు అందుకునేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం కోసమే ఈ నిధి అని పేర్కొన్నారు.