
న్యూఢిల్లీ : దేశంలోని పల్లెల్లో ఉపాథి అవకాశాలు పెంచేందుకు త్వరలో గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ స్కీమును తేనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించే ఈ స్కీమును జూన్ 20 న ప్రధాన మంత్రి చేతుల మీదుగా లాంఛ్ చేయనున్నట్లు తెలిపారు. సొంత ఊళ్లకు వచ్చిన వలస కార్మికులకు అక్కడే పని కల్పించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమును రూపొందించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
హైలైట్స్..
- 125 రోజులలో దేశంలోని 116 జిల్లాల్లో 25 ప్రభుత్వ స్కీములను కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ ( గొడుగు) కిందకి తెస్తాం.
- ఆరు రాష్ట్రాలలోని 116 జిల్లాలు ఈ స్కీములో చేరుతున్నాయి. కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్‌సీ), క్రిషి విగ్యాన్ కేంద్రాల ద్వారా పల్లెలు ఈ ప్రోగ్రామ్‌లో భాగమవుతాయి.
- వలస కార్మికులకు ఉపాథి కల్పించే ఈ ప్రోగ్రామ్ 125 రోజులపాటు మిషన్ తరహాలో పనిచేస్తుంది.
- గ్రామీణ ప్రాంతాలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం ద్వారా వలస కార్మికులకు ఉపాథి అవకాశాలు పెంచుతాం. మొత్తం 25 రకాల పనులను ఒకే గొడుగు కిందకి తెచ్చి రూ. 50 వేల కోట్ల విలువైన పనులు చేపడతాం.
- బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలలోనే ఎక్కువ మంది వలస కార్మికులు ఉండటంతో, ఆ రాష్ట్రాలలోని 116 జిల్లాలను కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ స్కీము కోసం ఎంపిక చేశాం. ఈ 116 జిల్లాల్లోనూ ఒక్కో జిల్లాకూ 25 వేల మందికి తగ్గకుండా వలస కార్మికులు సొంత ఇళ్లకు చేరుకున్నారు.
- కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ స్కీము కోసం కేంద్ర ప్రభుత్వంలోని 12 వేరు వేరు మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తాయి. ఇందులో రూరల్ డెవలప్‌మెంట్, పంచాయత్ రాజ్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్, మైన్స్, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్, రైల్వేస్, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్, రెన్యువబుల్ ఎనర్జీ, బోర్డర్ రోడ్స్, టెలికం, ఎగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లు ఉంటాయి.
- సొంత ఊళ్లకు తిరిగి వచ్చిన వలస కార్మికుల పనితనం (స్కిల్స్)ను ముందుగానే తెలుసుకుని, ఈ స్కీమును తెస్తున్నాం.
- 116 జిల్లాలలో ఎవరు కావాలనుకున్నా కొత్త ఎసైన్‌మెంట్‌ను ఈ స్కీము కింద కల్పిస్తాం. వెంటనే నిధులు కేటాయిస్తాం.
- సాధారణంగా ఆరు నుంచి ఏడాది కాలంలో పూర్తి చేసే వాటిని ఈ 125 రోజుల్లోనే పూర్తయ్యేలా ప్లాన్ చేశాం. కాబట్టి నిధులకు ఢోకా ఉండదు.
- రాబోయే నాలుగు నెలలూ వలస కార్మికులను ఈ స్కీము బిజీగా ఉంచుతుంది.
- ఏ జిల్లాలకు ఎక్కువగా వలస కార్మికులు తిరిగి వెళ్లారో పరిశీలించే, గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ స్కీమును తెస్తున్నాం.