వరుసగా నాలుగోసారి బడ్జెట్ పెడుతున్న మహిళా మంత్రి నిర్మలమ్మే

వరుసగా నాలుగోసారి బడ్జెట్ పెడుతున్న మహిళా మంత్రి నిర్మలమ్మే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. దేశంలో మహిళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆమెతోనే సాధ్యమైంది. వరుసగా నాలుగో సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1970లో తానే ప్రధానిగా, తానే ఆర్థిక మంత్రిగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ మన నిర్మలమ్మే. ఇప్పడు ఆమె వరుసగా నాలుగోసారి బడ్జెట్ పెడుతూ ఎవరికీ అందని ఘనతను సొంతం చేసుకున్నారు.

  • బడ్జెట్‌లో తనదైన గుర్తింపు నిలిచిపోయేలా నిర్మలా సీతారామన్ కొన్ని మార్పులకు నాంది పలికారు. అందులో ఒకటి గతంలో బడ్జెట్‌ను ఒక బ్రీఫ్‌కేస్‌లో పట్టుకుని వచ్చేవారు కేంద్ర ఆర్థిక మంత్రులు. నిర్మలమ్మ ఆ పద్ధతికి బ్రేక్ చెప్పి ఎరుపు రంగు క్లాత్‌తో కూడా బ్యాగ్‌తో పార్లమెంట్‌కు వస్తున్నారు.
  • దేశంలో సాంకేతికత ముందుకు వెళ్తున్న కొద్దీ జరుగుతున్న మార్పులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందిపుచ్చుకుంటున్నారు.  గత ఏడాది తొలిసారి పేపర్‌‌ లెస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారామె. ఈసారి కూడా అదే విధానాన్ని ఫాలో అవుతున్నారు.
  • ఈసారి కొత్తగా యూనియన్ బడ్జెట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌లో ప్రజలకు ‘డిజిటల్ బడ్జెట్ కాపీ’ అందుబాటులో ఉండనుంది.