
ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ అందిస్తున్నామన్నారు. డిజిటల్ విద్య అందించే ఉపాధ్యాయులకు అందుబాటులోకి ప్రపంచస్థాయి ఉపకరణాలు తీసుకొస్తామన్నారు. విద్యార్థులందరికి ఈ-కంటెంట్‌ను అందుబాటులోకి వస్తుందన్నారు. కరోనాతో దేశవ్యాప్తంగా అనేకమందికి మానసిక రుగ్మతలు ఉత్పన్నమయ్యాయన్నారు. మానసిక సమస్యల చికిత్స కోసం ఆన్‌లైన్ టెలీమెడిసిన్ విధానానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. బెంగళూరు ట్రిపుల్ ఐటీ సాంకేతిక సాయం అందిస్తుందన్నారు. గత రెండేళ్లలో నల్‌సే జల్ కింద 5.7కోట్ల కుటుంబాలకు అందుబాటులోకి తాగునీరు అందించామన్నారు. మహిళా, శిశు సంక్షేమం కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షం అంగన్‌వాడీల రూపకల్పన చేశామన్నారు. పీఎం ఆవాస యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణ చేపట్టామన్నారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం తీసుకొచ్చామన్నారు. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందిస్తామన్నారు.