రాబోయే ఐదేళ్లలో.. 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేసి.. పట్టణ, గ్రామీణ పేదలకు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారామె. ఈ పథకం కింద రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని.. పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని వెల్లడించారామె. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయటానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించబోయే 2 కోట్ల ఇళ్లను.. బస్తీల్లోని పేదలు, అద్దె ఇంటిలో ఉండే పేదలకు కేటాయించనున్నట్లు వెల్లడించనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం అని.. జిల్లాల వారీగా ఇళ్ల కేటాయింపు ఉంటుందని.. పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో రాబోయే ఐదేళ్లకు ప్రణాళిక రచించినట్లు వెల్లడించారామె.