మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచన కేంద్రానికి లేదు

మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచన కేంద్రానికి లేదు

భారత్ లో కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి  కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించనుందని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మళ్లీ లాక్ డౌన్ ను విధించే ఆలోచన కేంద్రానికి లేదని అన్నారు. అయితే.. కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో...ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులే నియంత్రణా చర్యలు చేపడతారని, కఠిన నిబంధనలను వారు అమలు చేసుకోవచ్చన్నారు.

గతేడాది లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్న నిర్మలా సీతారామన్.. మరోసారి అటువంటి పరిస్థితిని తీసుకుని రావడం తమకు ఇష్టం లేదన్నారు. కేసులు వచ్చిన ప్రాంతాల్లో మాత్రం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, ఈ విషయంలో రాష్ట్రాలు ఇచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.