బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతిసారీ ప్రత్యేకమైన చీరలను కట్టుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. నీలి, గోధుమ రంగులో ఉన్న టస్సర్ చేనేత పట్టు చీరను ధరించారు.
చీర మొత్తం నీలి రంగులో ఉండగా, దానిపై గోధుమ రంగులో ‘కాంత’ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ను పశ్చిమ బెంగాల్, ఒడిశాలో చేస్తుంటారు. నీలి రంగును ‘రామా బ్లూ’ అని కూడా పిలుస్తుంటారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా ఈసారి నీలి రంగు చీరను నిర్మల కట్టుకున్నారు.