నిరాడంబరంగా నిర్మలా సీతారామన్‌ కుమార్తె వివాహం 

నిరాడంబరంగా నిర్మలా సీతారామన్‌ కుమార్తె వివాహం 

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన కుమార్తె వాంగ్మయి వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరిపించారు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆమె నివాసంలో వివాహాన్ని జరిపించారు.  ఈ వివాహానికి రాజకీయ ప్రముఖులెవరూ హాజరుకాలేదు. సీతారామన్‌ కుమార్తె పరకాల వాంగ్మయి వివాహం గుజరాత్‌కు చెందిన ప్రతీక్‌తో జరిగింది. 

బెంగుళూరులోని ఉడిపిలోని అదమరు మఠ్‌కు చెందిన పురోహితులు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వివాహ క్రతువు నిర్వహించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా సీతారామన్‌ కుటుంబ సభ్యులు కూడా అధికారికంగా వెల్లడించలేదు.  పెళ్లి టైమ్ లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వధువు వాంగ్మయి గులాబీ రంగు చీర, ఆకుపచ్చ రవిక ధరించగా.. వరుడు ప్రతీక్‌ తెలుపు వర్ణం దుస్తుల్లో కనిపించారు. 

సీతారామన్ కుమార్తె వంగ్మయి మింట్ లాంజ్‌లో ఫీచర్ రైటర్. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ నుండి మాస్టర్స్ డిగ్రీని, నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీలోని మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుండి జర్నలిజంలో MS పట్టా పొందారు.