బస్టో అర్సిజియో (ఇటలీ): ఇండియా బాక్సర్ నిశాంత్ దేవ్ వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయర్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. గురువారం రాత్రి జరిగిన 71 కేజీ తొలి రౌండ్ లో నిశాంత్ 5–0తో జార్జియాకు చెందిన మెడియెవ్ ను చిత్తు చేశాడు. కానీ, సంజీత్ (92 కేజీ )0–5తో ఐబెక్ (కజకిస్తాన్) చేతిలో, అంకుషిత (66 కేజీ )2–3తో సొన్వికో ఎమిలె (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు.
