లక్ష యూనిట్ల మైలురాయిని దాటిన నిస్సాన్​ మాగ్నైట్

లక్ష యూనిట్ల మైలురాయిని దాటిన నిస్సాన్​ మాగ్నైట్

జపనీస్​ ఆటోమేకర్​ నిస్సాన్​ మోటార్​ ఇండియా చెన్నైలోని తన ప్లాంటులో లక్షవ​ మాగ్నైట్ ​ఎస్​యూవీని తయారు చేసినట్టు ప్రకటించింది. నిస్సాన్​ రెనాల్ట్​తో కలిసి చెన్నైకి 45 కిలోమీటర్ల దూరంలోని ఓరగాడం వద్ద ప్లాంటును ఏర్పాటు చేసింది. ఇది 600 ఎకరాల్లో విస్తరించి ఉంది. లక్షవ మాగ్నైట్ కారును నిస్సాన్​ కారును కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​లు జెండా ఊపి ప్రారంభించారు. 2020 డిసెంబరులో నిస్సాన్​మాగ్నైట్​ను లాంచ్​ చేసింది.