DRDOలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. డిగ్రీ, డిప్లొమా స్టూడెంట్స్ కి మంచి అవకాశం.. అప్లయ్ చేసుకోండిలా!

 DRDOలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. డిగ్రీ, డిప్లొమా స్టూడెంట్స్ కి మంచి అవకాశం.. అప్లయ్ చేసుకోండిలా!

డీఆర్​డీఓకు చెందిన డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ & డాక్యుమెంటేషన్ సెంటర్ (డీఈఎస్ఐడీఓసీ) 2026–2027 ఆర్థిక సంవత్సరానికిగాను అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అప్లికేషన్లు కోరుతోంది. 

పోస్టు పేరు: అప్రెంటీస్​షిప్. 

మొత్తం ఖాళీలు: 20. 

విభాగాల వారీగా ఖాళీలు: లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ 16, కంప్యూటర్ సైన్స్ 2, ఫొటోగ్రఫీ/ వీడియోగ్రఫీ 2. 

ఎలిజిబిలిటీ
లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ + లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్సులో ఏడాది డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
కంప్యూటర్ సైన్స్: కంప్యూటర్ సైన్సులో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్ సైన్సులో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 
ఫొటోగ్రఫీ/ వీడియోగ్రఫీ: ఫొటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో మూడేండ్ల డిప్లొమా లేదా ఐటీఐ పూర్తిచేసి ఉండాలి .

గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు  వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 10.

లాస్ట్ డేట్: జులై 1. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.drdo.gov.inను సంప్రదించండి. 

 

►ALSO READ | అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. జయశంకర్ అగ్రి యూనివర్సిటీలో JRF కొలువులు.. జూన్ 16న ఇంటర్వ్యూలు..