భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దే! : ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ డా. ఎన్ వీ శ్రీకాంత్.

భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దే! : ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ డా. ఎన్ వీ శ్రీకాంత్.

తిమ్మాపూర్​, వెలుగు: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేననీ, విద్యార్థులంతా ఆ దిశగా రాణించాలని ఎన్ఐటీ వరంగల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ డా. ఎన్ వీ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్​ కళాశాలలో ఏఐసీటీఈ అటల్ అకాడమీ సౌజన్యంతో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో  ‘అటానమస్ అండ్​ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ’  అంశంపై  ఫ్యాకల్టీ డెవలప్‌‌‌‌మెంట్ ప్రోగ్రాం జరగ్గా, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి వెలిగించి, మొదటిరోజులో బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంశంపై ఆయన ప్రసంగించారు. 

కళాశాల చైర్మన్ జవ్వాడి సాగర్ రావు మాట్లాడుతూ.. ఫ్యాకల్టీ సభ్యులు, పరిశోధకులు,​ పరిశ్రమ నిపుణులకు ఎలక్ట్రిక్ మొబిలిటీ, అటానమస్ డ్రైవింగ్ అండ్​ వెహికల్ కనెక్టివిటీలో తాజా అప్ డేట్స్ తెలుసుకునేందుకు ఈ ఎఫ్​డీపీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. స్మార్ట్ ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌‌‌‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఎటీ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్​) లాంటి కీలక అంశాలపై వారంపాటు చర్చలుంటాయని ప్రిన్సిపాల్ డా. టీ అనిల్ కుమార్ తెలిపారు. ఐఐటీ, అండ్​ ఎన్​ఐటీల నుంచి చాలామంది ప్రముఖులు, విద్యావేత్తలు, ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తారని, ప్రొగ్రాం కన్వీనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.  కాలేజీల సెక్రెటరీ సుమిత్​ సాయి, డీన్​ ఆఫ్​ అకడమిక్స్​ పీకే వైశాలి తదితరులు పాల్గొన్నారు.