నితిన్ హీరోగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న 36వ చిత్రమిది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఇది రూపొందుతోందని అనౌన్స్ చేసిన మేకర్స్.. ఈ సందర్భంగా ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నితిన్ షాడోను చూపిస్తూ ఆ పోస్టర్‌పై ‘నో బడీ నో రూల్స్’ అని క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
సైఫై ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించే దర్శకుడు వీఐ ఆనంద్ మరోసారి తన మార్క్ చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం నితిన్ కెరీర్‌లో అత్యంత ఆసక్తికరమై ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా మారనుందని మేకర్స్ చెప్పారు. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసి రెగ్యుల్ షూటింగ్‌ను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలియజేశారు. అలాగే హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
