ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటో తీసి పోస్టు చేసిన నిత్యా మీనన్

ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటో తీసి పోస్టు చేసిన నిత్యా మీనన్

ఎన్ని సినిమాలు చేశామనేది కాదు, ఎంత మంచి సినిమాలు చేశామనేది ముఖ్యం అంటుంది నిత్యామీనన్. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మాట మీద ఉంది. ఆచి తూచి ప్రాజెక్టులు ఎంచుకుంటుంది. బలమైన పాత్ర అయితేనే గ్రీన్ సిగ్నల్‌‌‌‌ ఇస్తుంది. అందుకే ఆమె ఓ సినిమా చేస్తోందంటే అందులో కచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని నమ్ముతారంతా. మరోసారి అలాంటి ఓ చిత్రంతో రాబోతోంది నిత్య. అదే.. ‘వండర్‌‌‌‌‌‌‌‌ ఉమెన్’. ఇందులో నిత్యతో పాటు పార్వతి తిరువోతు కూడా లీడ్ రోల్ చేస్తోంది. ఆ విషయాన్ని ఈ ఇద్దరూ చాలా వెరైటీగా ప్రకటించారు.

పాజిటివ్ రిజల్ట్ చూపిస్తున్న ప్రెగ్నెన్సీ కిట్స్‌‌‌‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘వండర్ బిగిన్స్’ అని రాశారు. దాంతో నెటిజన్స్ కన్‌‌‌‌ఫ్యూజ్ అయ్యారు. కొందరైతే షాకయ్యారు. ఇంకొందరు తేరుకుని కంగ్రాట్స్ కూడా చెప్పేశారు. ఆ తర్వాత తెలిసింది అది వాళ్ల మలయాళ సినిమా ప్రమోషన్ అని. దాంతో భలే సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ఇచ్చారంటూ విషెస్ చెప్పారు. అంజలీ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రెగ్నెంట్ లేడీస్ చుట్టూ తిరుగుతుంది. అందుకే ఇలా ప్రకటించారు. గతంలో అంజలి, నిత్య, పార్వతి కలిసి ‘బెంగళూర్ డేస్’ చిత్రానికి పని చేశారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా కోసం కలిశారు. ఇతర వివరాలను త్వరలోనే అఫీషియల్‌‌‌‌గా అనౌన్స్ చేయనున్నారు.