స్కూల్లో పాఠాలు చెబుతున్న నిత్యా మీనన్ 

స్కూల్లో పాఠాలు చెబుతున్న నిత్యా మీనన్ 

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ ఇప్పుడు టీచర్ గా మారింది. అయితే అది సినిమాలో అనుకుంటే పొరపాటే.. నిజంగానే ఆమె టీచర్ గా మారి పిల్లలకు పాఠాలు చెబుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె తన ఇన్ స్టా గ్రాంలో షేర్ చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ కోసం నిత్య తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణాపురం గ్రామానికి వెళ్లింది. అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుండగా..బ్రేక్ టైంలో పక్కనే ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. అక్కడ స్యూల్ పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడిన నిత్య ఆ తర్వాత వారికి పాఠాలు బోధించింది. ఇంగ్లీష్ బుక్ లో కథను పిల్లలకి తెలుగులో వివరించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

కృష్ణాపురం గ్రామంలోని ఈ పిల్లలతో న్యూ ఇయర్‌ డే ఆనందంగా గడిచిందంటూ నిత్యామీనన్ ఇన్ స్టా గ్రాం పోస్టులో రాసుకొచ్చింది. పల్లెటూర్లలో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఆనందంతో గడుపుతారని.. వాళ్లు తన చుట్టూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటానని చెప్పింది.