నీతి ఆయోగ్‌ ఆఫీసర్‌‌కు కరోనా

నీతి ఆయోగ్‌ ఆఫీసర్‌‌కు కరోనా

బిల్డింగ్‌ క్లోజ్‌ చేసిన అధికారులు

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌లో పనిచేస్తున్న డైరెక్టర్‌‌ లెవల్‌ ఆఫీసర్‌‌ ఒకరికి మంగళవారం కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఢిల్లీలోని నీతి ఆయోగ్‌ ఆఫీస్‌ను మూసేశారు. రెండు రోజుల పాటు ఆఫీస్‌ను క్లోజ్‌ చేసి శానిటైజ్‌ చేస్తామని అధికారులు చెప్పారు. హెల్త్‌ మినిస్ట్రీ ప్రోటోకాల్‌ ప్రకారం అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్న వారంతా సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని నీతి ఆయోగ్‌ డిప్యూటీ సెక్రటరీ అజిత్ కుమార్‌‌ చెప్పారు.