మూలన పడిన మీ వాహనం ఇస్తే.. కొత్త కారుపై భారీ డిస్కౌంట్

మూలన పడిన మీ వాహనం ఇస్తే.. కొత్త కారుపై భారీ డిస్కౌంట్

కొత్త కారు  కొనే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.   పాత వాహనాల్ని తుక్కుకు సమర్పించి వాలిడ్ డిపాజిట్ సర్టిఫికెట్ చూపిస్తే కొత్త కారు కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్ ను కల్పించింది. కమర్షియల్  లేదా ప్యాసెంజర్ వాహనాల తయారీ కంపెనీలు కొత్త వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్  కల్పించేందుకు  అంగీకరించిందని ఈ మేరకు  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  ప్రకటించారు. 

స్క్రాప్ కంపెనీలు ఈ డిస్కౌంట్ కు ఒకే చెప్పాయన్నారు నితిన్ గడ్కరీ. అంటే పాత వాహనం స్క్రాప్ కు ఇచ్చినట్టు సర్టిఫికెట్ చూపిస్తే కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై డిస్కౌంట్ పొందవచ్చు. తమ పాత వాహనాలను స్క్రాప్ చేసి కొత్త వెహికల్  కొనుగోలు చేసే వారికి దాదాపు  1.5 శాతం నుంచి -3.5 శాతం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది.

Also Read :- చర్చలు, సంప్రదింపులే పరిష్కారం

ఢిల్లీలో  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్) సీఈవోలతో జరిగిన సమావేశంలో  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా ఆటో రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. 

దేశంలో 1000 వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు.. 400 ఆటోమేటెడ్ ఫిట్‌నెస్  సెంటర్లు అవసరమని  నితిన్ గడ్కరీ 2023లో చెప్పిన సంగతి తెలిసిందే..