ఈ నెల 6 మేనిఫెస్టో విడుదల చేయనున్న బీజేపీ

ఈ నెల 6 మేనిఫెస్టో విడుదల చేయనున్న బీజేపీ

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఈ నెల 6న మేనిఫెస్టోను విడుదల చేయనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. తమ పార్టీ మేనిఫెస్టో కేవలం హామీపత్రం కాదని, ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఉంటుందని గోవా రాష్ట్రశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే మేనిఫెస్టో విడుదల చేసిన రోజునే ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉత్తర గోవాలోని 20 ప్రాంతాల ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. 

ఇదిలాఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గోవా కాంగ్రెస్ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయ్ స్కీంను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు రాహుల్ ప్రకటించారు. 

మరిన్ని వార్తల కోసం..

జడ్ కేటగిరీ సెక్యూరిటీపై స్పందించిన ఒవైసీ

రిపబ్లిక్‌ డే: తివిధ దళాల్లో బెస్ట్ పరేడ్‌ విన్నర్‌‌గా నేవీ