
చాలా సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయి మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నితిన్. ‘మాచర్ల నియోజకవర్గం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. ఎడిటర్ ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కేథరీన్ థ్రెసా, కృతీశెట్టి హీరోయిన్స్. నిన్న ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని పనులు పెండింగ్ ఉండటంతో వాయిదా వేసిన మేకర్స్, ఇప్పుడు కొత్త డేట్‌ని ప్రకటించారు. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. వీకెండ్‌తో పాటు సోమవారం ఇండిపెండెన్స్ డే కూడా కలసి రావడంతో మూవీకి ప్లస్ అవుతుందని భావించి ఈ డేట్‌ను ఫిక్స్ చేశారట. ఇందులో నితిన్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. రాజ్‌కుమార్ ఆకెళ్ళ సమర్పణలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఓ మూవీ స్టార్ట్ చేశాడు నితిన్. ప్రస్తుతం ఫారిన్‌లో షూటింగ్ జరుగుతోంది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.