షి ఈజ్ బ్యాడ్‌‌: రూటు మార్చిన నివేదా

షి ఈజ్ బ్యాడ్‌‌:  రూటు మార్చిన నివేదా

ఎప్పుడూ కూల్‌‌గా, క్యూట్‌‌గా ఉండే పాత్రల్లో కనిపించే నివేదా పేతురాజ్.. ఈసారి రూటు మార్చి కొత్త ప్రయత్నం చేసింది. ఓ థ్రిల్లర్‌‌‌‌ కాన్సెప్ట్‌‌తో రాబోతోంది. ఆహా ఓటీటీ కోసం చందు మొండేటి తెరకెక్కించిన ‘బ్లడీ మేరీ’ చిత్రంలో నటించింది నివేద. ‘టు ద బ్యాడ్.. షి ఈజ్ బ్లడీ బ్యాడ్’ అనేది ట్యాగ్‌‌లైన్. కిరీటి దామరాజు, రాజ్‌‌కుమార్ కసిరెడ్డి, బ్రహ్మాజీ, అజయ్ ఇతర పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కాలభైరవ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే స్ట్రీమింగ్‌‌కి రానున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ను నిన్న రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో తను వైకల్యం ఉన్న అమ్మాయిగా నటిస్తోంది. అయినా కూడా తనకెదురైన సమస్యలన్నింటినీ ఎలా ఎదుర్కొని ధైర్యంగా నిలబడింది, జీవితంలో ఎలా గెలిచింది అనేది కథ. దాన్ని బట్టి గత చిత్రాల్లోని పాత్రలకు పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌‌‌‌ చేస్తోందని అర్థమవుతోంది. నిజానికి ఇరవయ్యో శతాబ్దంలో ‘బ్లడీ మేరీ’ అనే దెయ్యం ఉండేదని విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు. చీకటి గదిలో కొవ్వొత్తి పట్టుకుని అద్దం ముందు నిలబడి, మూడుసార్లు తన పేరు పిలిస్తే మేరీ అనే దెయ్యం అద్దంలో ప్రత్యక్షమయ్యేదట. కొందరు దీన్ని కట్టుకథ అంటే, మరికొందరు మాత్రం నిజమని ఇప్పటికీ నమ్ముతుంటారు. నివేద సినిమాకి ఆ పేరు పెట్టడం అనుకోకుండా జరిగిందో లేక ఆ స్టోరీకీ దీనికీ ఏదైనా సంబంధం ఉందో!