వారి న్యాయమైన కోరికను తీర్చాల్సిన బాధ్యత సీఎందే

వారి న్యాయమైన కోరికను తీర్చాల్సిన బాధ్యత సీఎందే

పిట్లం, వెలుగు: సీఎం ఇచ్చిన హామీ ప్రకారం వీఆర్ఏలకు పేస్కేల్‌‌‌‌ అమలు చేయాలని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​అరుణతార డిమాండ్ చేశారు. సోమవారం పిట్లంలో వీఆర్ఏల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా అరుణతార మాట్లాడుతూ వీఆర్ఏలు కొత్తగా ఏమీ కోరడం లేదని సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారన్నారు. వారి న్యాయమైన కోరికను తీర్చాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. వారు 15 రోజులుగా సమ్మె చేస్తున్నా స్పందించకపోవడం సరికాదన్నారు. త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం చర్చలకు పిలిచి మరోసారి మోసం చేసే అవకాశం ఉందన్నారు. ఇచ్చిన హామీలను తీర్చినప్పుడే సమ్మె విరమించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల మండల అధ్యక్షుడు అభినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సెక్రటరీ సాయిరెడ్డి, ఓబీసీ జిల్లా వైస్​ప్రెసిడెంట్ అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆగంరెడ్డి, లాల్​సింగ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

 భిక్కనూరులో భిక్షాటన

భిక్కనూరు, వెలలుగు: వీఆర్ఏలు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా భిక్కనూరులో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు గడ్డం శ్రీకాంత్, గొనుగోపుల స్వామి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.