
నిజామాబాద్, వెలుగు : మోపాల్ మండలం కాల్పోల్ తండాలో జ్వరాలు తగ్గే వరకు మెడికల్ క్యాంప్ కొనసాగించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం తండాను విజిట్ చేసి వీధులన్నీ తిరిగారు. మురుగు కాల్వలు క్లీన్ చేయించి దోమల నివారణ మందు పిచికారీ చేయాలన్నారు. పాత టైర్లలో నిలిచిన నీటిని తొలగించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని డీపీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు. జ్వరపీడితులకు మెరుగైన వైద్యం అందించాలని మలేరియా ఆఫీసర్ డాక్టర్ తుకారాంరాథోడ్కు సూచించారు.
సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. తండావాసులు ఎలాంటి ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. అయితే అధిక జ్వరంతో బాధపడుతూ నీరసించిన నలుగురు పేషెంట్స్‌ను అంబులెన్స్‌లో డాక్టర్లు జీజీహెచ్‌కు షిఫ్ట్ చేశారు. 20 మందికి అక్కడే ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఎంపీడీవో రాములు, ఎంపీవో కిరణ్ తదితరులు
ఉన్నారు.
హాస్టల్ తనిఖీ..
కంజర రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ కమ్ హాస్టల్‌ను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సోమవారం తనిఖీ చేశారు. భోజనాలు ఎలా అందిస్తున్నారని స్టూడెంట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వార్డెన్‌కు సూచించారు. వంట సరుకులు, డైనింగ్ హాల్ పరిశీలించారు. పరిశుభ్రత పాటించాలని, రెగ్యులర్‌గా స్టూడెంట్స్రోకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు.