నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండలు

నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండలు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 2 రోజులుగా రాష్ట్రంలో అత్యదిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మోర్తాడ్ లో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణొగ్రత నమోదయింది. కమ్మర్ పల్లిలో 39.5, కోడప్ గళ్ లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఉదయం 10 గంటలు దాటితే భయట తిరిగేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు ఈ ఎండాకాలంలో రాష్ట్రమంతటా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.