కేంద్రం మాట వింటే ఈ సమస్య ఎదురయ్యేది కాదు

కేంద్రం మాట వింటే ఈ సమస్య ఎదురయ్యేది కాదు

రాష్ట్రంలో యూరియా కొరతకు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తూ… స్పీకర్ పోచారం ఒత్తిడితో యూరియాను వాటాకు మించి కామారెడ్డి జిల్లాకి తరలిస్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాకు 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా తగ్గించారని, ఎరువులు అందక..రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. కేంద్రం సూచనలు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ సమస్య ఎదురైందని,  జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి,  ఎమ్మెల్యేలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని హితవు పలికారు.

కవితను ఓడించినందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు ఎంపీ. తెలంగాణ పై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తండ్రి కేసీఆర్ లాగే కేటీఆర్ కూడా ఫామ్  హౌస్ కే  పరిమితమయ్యారని  అరవింద్ అన్నారు.