దమ్ముంటే నాసెగ్మెంట్​లో ఎన్నికలకు వెళ్లండి

దమ్ముంటే నాసెగ్మెంట్​లో ఎన్నికలకు వెళ్లండి

నిజామాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి సవాల్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ను తరిమికొట్టి రామరాజ్యం వచ్చే వరకు పోరాటం ఆగదని తెలిపారు. సూడో(కపట)సెక్యులర్ పార్టీలు దేశానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ ఎస్ మైనార్టీ పార్టీల పక్షాన చేరి హిందూ వ్యతిరేకిగా మారందన్నారు. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని, ఒకప్పటి పాక్ ప్రధాని బేనజీర్ భుట్టో హిజాబ్ వేసుకోలేదని చెప్పారు. ‘‘మొన్న ఇస్సాపల్లి లో రైతులు దాడి చేశారని తప్పుడు ప్రకటనలు చేశారు. మరి ఇప్పుడు మా కార్యకర్తలపై దాడి చేసింది నిరుద్యోగులా” అని అర్వింద్ ఎద్దేవా చేశారు. ఇతరులు దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం మనం కూడా ఏదైనా చెయ్యొచ్చని, ఇప్పటి నుంచి ఆత్మరక్షణ కు దిగుతామని ఆయన అన్నారు. రెండు నెలల్లో టీఆర్​ఎస్ లో కార్యకర్తలు ఎవరూ ఉండరని అన్నారు. పోటీ చేసే దిక్కు లేక.. నాయకత్వం పోయి టీఆర్​ఎస్ అనాథగా మారుతుందని జోస్యం చెప్పారు.