నిజామాబాద్ డ్రంకెన్ డ్రైవ్లో రూ.43 లక్షల జరిమానా : సీపీ సాయి చైతన్య

నిజామాబాద్  డ్రంకెన్ డ్రైవ్లో రూ.43 లక్షల జరిమానా : సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా పోలీస్ ​కమిషనరేట్​పరిధిలో రెండు వారాలపాటు నిర్వహించిన డ్రంకెడ్​ డ్రైవ్​​లో 471 కేసులు నమోదు చేశామని సీపీ సాయిచైతన్య తెలిపారు. ఆదివారం ఆయన మీడియాకు ప్రకటన రిలీజ్​చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి రూ.43.30 లక్షల జరిమానాలు విధించారని తెలిపారు. 

ఇందులో 38 మందికి వారం రోజుల జైలు శిక్ష కూడా విధిస్తూ తీర్పు చెప్పారన్నారు. లోక్​అదాలత్​లో 5,662 కేసుల మధ్య పరస్పర అంగీకారంతో రాజీ కుదుర్చామని పేర్కొన్నారు. సైబర్​నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు రూ.31.82 లక్షలు రికవరీ చేసి ఇప్పించామన్నారు.