దేశం దృష్టిని ఆకర్షిస్తున్న నిజామాబాద్ పోలింగ్

దేశం దృష్టిని ఆకర్షిస్తున్న నిజామాబాద్ పోలింగ్
  • కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్న ఎన్నిక
  • బరిలో మొత్తం 185 మంది.. వారిలో 176 మంది రైతులు
  • స్పె షల్ మాన్యు వల్ జారీ చేసిన ఈసీ
  • ప్రపంచంలోనే తొలిసారిగా ఎం.3 ఈవీఎంల వాడకం
  • గిన్నిస్ బుక్ లోకి ఎక్కే అవకాశం

లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పసుపు, ఎర్ర-జొన్న రైతుల తిరుగుబాటుతో ఇక్కడ జరిగే ఎన్నికలు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఈ సెగ్మెంట్‌ నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో 176 మంది రైతులున్నారు . తమ పంటలకు మద్దతు ధర ప్రకటించాలని, సమస్యలు తీర్చాలని రైతులు పోటాపోటీగా నామినేషన్లు వేయటంతో ఈ పోలింగ్‌ ఎన్నికల సంఘానికి సవాల్ గా మారింది. ఒక రకంగా ఈసీ దీన్ని చాలెంజింగ్‌గా తీసుకుంది. నిజానికి 90 మందికి మించి పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించాల్సి వస్తుందని రైతులు భావించారు. ఎన్నిక కొంతకాలం వాయిదా పడొచ్చన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ వాటికి ఈసీ చెక్ పెట్టింది. ఎం3 మోడల్ ఈవీఎంలను తయారు చేయించి .. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లతో ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఖర్చుకు వెనుకాడకుండా అవసరమైనంత మంది సాంకేతిక నిపుణులను, సిబ్బందిని మోహరిస్తోంది. షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ నిర్వహించేందుకు రెడీ అయింది. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌ కుమార్తె, సిట్టింగ్‌‌‌‌ ఎంపీకవిత, కాంగ్రెస్‌‌‌‌ నుంచి మధు యాష్కీ గౌడ్, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నా .. ఎన్నిక మొత్తం పసుపు రైతుల చుట్టే తిరుగుతోంది. ఈ నియోజకవర్గం పరిధిలో పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపు 70 వేల ఎకరాల్లో పసుపు, 40 వేల ఎకరాల్లో ఎర్రజొన్న పండిస్తారు.

కాస్ట్లీ ఎలక్షన్..

దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా 12యూనిట్ల ఈవీఎంలతో జరుగుతున్న ఎన్నికలు ఇవే కావట. ఎన్నికల నిర్వహణకు ఈసీ రు.35కోట్లు ఖర్చు చేస్తోం ది. నియోజకవర్గాల వారీగా ఖర్చు చూస్తే ఈ ఎన్నికే అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కనుం ది. నిజామాబాద్ లోక్‌ సభ పరిధిలో 15.52 లక్షల మంది ఓటర్లున్నా రు. నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 5, జగిత్యాల జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజక వర్గాలు ఈ సెగ్మెంట్‌‌‌‌లో ఉన్నా యి. పోలింగ్ నిర్వహణకు 1,788 పోలిం గ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12 బ్యాలెట్ యూనిట్లు ఓ వీవీప్యాట్ తో కూడిన ఎం 3 ఈవీఎంలను వాడుతున్నారు. పోలింగ్ స్టేషన్ లో వీటిని ఎల్ ఆకారంలో అమర్చనున్నారు. ఎన్నికల పోటీలో ఉన్న 185 మంది, నోటాతో కలిపి 186 గుర్తులు ఈవీఎంలలోఉంటాయి. వీటిని పరీక్షించడానికి బెంగళూరు బీఈఎల్ నుంచి 600 మంది ఇంజనీర్లు వచ్చారు.యుద్ధప్రా తిపదికన ఈవీఎంల చెకింగ్ పనులుచేపట్టారు.

వరల్డ్ రికార్డు

ఇప్పటివరకు దేశంలో ఎం.2 ఈవీఎంల ద్వారా 4 బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించటం రికార్డు. కానీ నిజామాబాద్‌‌‌‌లో ఎం3 ఈవీఎంల తో ఒక్కో కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా ఎం.3ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఈ ఎన్నిక గిన్నిస్ బుక్ రికార్డు కెక్కే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పనిని తక్కువ సమయంలో చేయడం రికార్డంటున్నారు.

స్పెషల్ మాన్యువల్

కేంద్ర ఎన్నికల సంఘం నిజమామాద్‌‌ ఎన్నికకు ప్రత్యేకమైన ప్రొటోకాల్ ఆదేశాలు, నిబంధనలుజారీ చేయటం గమనార్హం. గతంలో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టోరల్ అధికారిని ఈసీ నియమించేది. అయితే ఇక్కడ ప్రతి అయిదు పోలింగ్ కేంద్రాలకో సెక్టోరల్ అధికారిని నియమిస్తున్నారు. సెక్టోరల్ అధికారితో పాటు నిపుణుల బృందం కూడా ఉంటుంది.

టైం మారింది..

నిజామాబాద్‌‌‌‌లో పోలింగ్ టైంను కూడా మార్చారు. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుం ది. కానీ.. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలిం గ్ నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు గంటల పాటు మాక్ పోలింగ్‌‌‌‌కు టైం కేటాయించారు. ఎన్నికల నిర్వహణకు ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో ఐదుగురు విధుల్లో ఉంటారు.

బలగం భారీగానే..

పోలింగ్ నిర్వహణకు మొత్తం 1,438 ప్రిసైడింగ్ అధికారులు, 1,438 సహాయ ప్రిసైడింగ్ అధికారులతో పాటు 4,314 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. 1,788 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా 26, 820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్‌‌‌‌లు వాడనున్నారు.

ప్రత్యేకంగా హెలీప్యాడ్లు

నిజామాబాద్ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అధికారుల రాకపోకలకు వీలుగా సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా హెలీప్యాడ్లను సిద్ధంగా ఉంచారు. సీఈవో రజత్ కుమార్‌‌‌‌తోపాటు ఈసీఐ నుంచి కూడా ప్రత్యేకంగా అధికారులు ఈ నియోజకవర్గంలో పర్యటించి వెళ్లారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై,  రైతుల ఫిర్యాదులపై వివరాలు సేకరించారు. ఈ నెల 2న కేంద్ర ఎన్నికల సంఘం నుంచి డిప్యూటీ కమిషనర్ సుదీప్ జైన్, ప్రోగ్రాం కన్సల్టెంట్ నిఖిల్ కుమార్, అడిషనల్ సీఈవో జ్యోతి బుద్ధ ప్రకాష్ ఇక్కడి పరిస్థితులను పరిశీలించి వెళ్లారు. బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 600 మంది బీఈఎల్ ఇంజనీర్లు వచ్చారు.

మా ఆవేదనను అర్థం చేసుకోవాలి

మేం ఎవరినో ఓడించాలనో, మరెవరినో గెలిపించాలనో పోటీలో లేం. కేవలం సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకేబరిలో నిలిచాం. నామినేషన్లు వేసిన 176 మందిలో ఎవరికివారుగా ఉండాలా.. మాలో ఎవరికైనా ఒక్కరికే మద్దతు ఇవ్వాలాఅనే దానిపై ఆర్మూరు సభలో నిర్ణయం తీసుకుంటాం.పాలకులు మా ఆవేదనను అర్థం చేసుకోవాలి.   – రాజేశ్వర్‌‌‌‌రెడ్డి , పోటీ చేస్తున్న రైతు, ముప్కల్‌

‌‌‌ఎవరూ పట్టించుకోలేదు

తెలంగాణ వచ్చాక మా సమస్యలు తీరుతాయని ఆశించాం. కానీ ఎవరూ పట్టిం చుకోలేదు. అందుకే చివరి ప్రయత్నంగా  ఈ మార్గం ఎంచుకున్నాం . సమస్య పరిష్కారం ప్రభుత్వం చేతిలో ఉంది. న్యాయం జరిగే వరకు మా ఉద్యమం ఆగదు.    – ప్రభాకర్‌‌‌‌, రైతు సంఘం నాయకుడు

సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి.  సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిన్నాం . బోనస్‌ ఇస్తాం. కోడ్‌‌‌‌ ఉండడంతో ప్రకటన చేయడం లేదు. ఎర్రజొన్న రైతులకు గతంలో 11కోట్లు ఇచ్చాం. రైతు సమస్యల పరిష్కారానికి కట్టు బడి ఉన్నాం . కేంద్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.రైతులతో కలిసి పోరాటం చేస్తాం.  – కల్వకుంట్ల కవిత, ఎంపీ