నిజామాబాద్ రూరల్/మోపాల్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ మండలం పాల్ద గ్రామంలో, మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. రూరల్ నియోజకవర్గానికి 550 మహిళా సంఘాలకు సంబంధించి రూ.6 కోట్ల 80 లక్షల రుణమాఫీ చెక్కులను పంపిణీ అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని, ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు పొద్దున్న శ్రీధర్, జనార్దన్, సతీశ్, గంగాప్రసాద్, భోజన్న, గంగాధర్, కిరణ్ రావు, ఒడ్డెన్న, శ్రీధర్తదితరులు పాల్గొన్నారు.
